Thursday, June 2, 2011

మీ బుర్ర లో ఏదైనా ప్రశ్న తిరుగుతుందా, సమాధానం ఇక్కడుంది.

దేహమున్న వాడికి సందేహం రాక తప్పదు“. మెడకాయ మీద తలకాయ అనేది ఒకటుంది కాబట్టే మనకు సందేహం వస్తుంది. మరి దాన్నెలా తీర్చుకోవాలి. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ…” ఎక్స్ క్యుజ్ మి, టైం ఎంత ? “, అన్నంత సాధారణంగా ” ఎక్స్ క్యుజ్ మి, ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? అని అడగలేం కదా. అలా అని నోరు మూసుకొని ఉరుకుంటే బుర్ర బద్దలైపోతుంది. రోజూ ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడం ఎంత అవసరమో, సందేహం తీర్చుకోవడం కూడా అంతే అవసరం అనడంలో సందేహం లేదు.

ఎక్కడ అడగాలి ?

అలా అడిగారు బాగుంది. తెలుగువాహిని.కామ్ లో మీ సందేహం పేజి క్లిక్ చేయండి. అక్కడ మీ సందేహాన్ని పోస్ట్ చేయండి.

ఎలాంటి ప్రశ్నలు అడగాలి ?
ఇది…, అది…, అనేమి లేదు. ఏదైనా అడగవచ్చు. సందేహం ఏ రకమైన…, ఏ రంగమైనా అయి ఉండవచ్చు. వైద్యం నుంచి పారిశుద్యం వరకు, త్రేతాయుగపు రాముడి నుంచి కలియుగపు సత్య సాయి వరకు, తోలు బొమ్మలాట, బుర్రకథ మొదలు బాలివుడ్ సినిమాల వరకు అడగవచ్చు. ఆత్రేయపురం పూత రేకులుపై పూసే ఆవు నెయ్యి నుంచి అమెరికా అధ్యక్షుడు ఒబామా జేబులో ఆంజనేయ స్వామి బిళ్ళ వరకు ఏదైనా ప్రశ్నకు అనర్హం కాదు.
మీ ప్రశ్నకు ఆకాశమే హద్దు….., అని అనుకోకండి. ఆకాశం అవతల ఉన్న హద్దుల ఏమిటి అనే సందేహం వస్తే అదీ అడగండి. అస్త్రాలజీ విద్యార్ధులో, విద్యావేత్తలో సమాధానం చెప్పకపోరు.
మీకున్న క్వశ్చన్ సిల్లీదా…, మిలియన్ డాలర్ల వాల్యూ ఉన్నదా అని ఎవరు క్వశ్నించరు. కాబట్టి సంతోషంగా ప్రశ్నించవచ్చు. సమాధానం వస్తుందన్న సంతృప్తి మీ మెదడును రిలాక్స్ పరుస్తుందని మరిచిపోకండి. మీ ప్రశ్నకు వచ్చిన సమాధానం ఏంటో తెలుసుకోవాలంటే ప్రశ్నకు కుడి వైపు కామెంట్స్ ( కామెంట్స్ ) అని ఉన్న చోట క్లిక్ చేయండి. కామెంట్స్ విభాగం లో మీకు సమాధానాలు లభిస్తాయి. సైట్ లో ఏదైనా ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కామెంట్ అని ఉన్న చోట మీ సమాధానం రాయండి. ఈ పూర్తి కార్యక్రమం లో మీ ఈ-మెయిల అడ్రస్ ఎక్కడ ప్రచురించబడదు.
ఇట్లు
తెలుగువాహిని - www.teluguvaahini.com

No comments:

Post a Comment