Tuesday, December 26, 2023
Tuesday, December 19, 2023
యానిమల్ సినిమా రేంజ్ పెంచేసిన టాప్ 3 మ్యాజికల్ మ్యూజికల్ సీక్రెట్స్
యానిమల్ సినిమా ఈ వీకెండ్ పూర్తయ్యేటప్పటికి, అంటే పదహారు రోజులు గడిచేటప్పటికి ఏకంగా ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. వీటికి ఓటిటి రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్... ఇలాంటివన్నీ ఎక్స్‌ట్రా. ఇక ఈ సినిమాలో నటించిన..., నటించిన ఏంటి?... వినిపించిన, కనిపించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వచ్చింది. సెకండ్ హీరోయిన్ తృప్తి డిమ్రికి, విలన్‌గా చేసిన బాబీ డియోల్‌కు, ఆ విలన్ మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్యగా చేసినోళ్లకు, చివరకు విలన్ ఎంట్రీ సాంగ్‌లో ఒక్క సెకన్ కనిపించిన తన్నాజ్ దావూదీ అనే అమ్మాయికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇంత మంది రేంజ్ పెరిగిందంటే సినిమా సూపర్ హిట్ అనాల్సిందే కదా. సరే ఇంతకీ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారణం ఏంటి? దట్ ఈజ్ మ్యాజిక్. సందీప్ రెడ్డి ఈ సినిమాలో ప్రతి పది, పదిహేను నిమిషాలకు ఓ చిన్న సర్‌ప్రైజ్ ఎలిమెంటూ, ఓ హై ఇచ్చే మూవ్ మెంట్ ఇస్తూ..., తను చెప్పాలనుకున్న కంటెంట్‌ను చాలా ఇంపాక్ట్‌తో చూపించాడు. సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ సినిమా అంతా అలా కనిపిస్తూనే ఉంటాయి. అండర్‌వేర్ గురించి డిస్కషన్స్, న్యూడ్‌గా కనిపించే సీన్స్.. ఇలా వరుసగా వస్తూనే ఉంటాయి. అయితే సర్‌ప్రైజ్ అయినా ఉంటుంది, లేదా షాక్ అయినా తగులుద్ది. అంతే తప్ప కుర్చీలో కుదురుగా కుర్చొని చూసేలా ఉండదు. అందుకే సినిమా ఆడియన్స్‌కు నచ్చింది. ఇక మూడు మ్యూజిక్ బిట్స్ సినిమా రేంజ్ పెంచేశాయి. ఆ మ్యూజికల్ సీక్రెట్స్ ఈ వీడియోలో చూడండి. #యానిమల్‌సినిమా #యానిమల్‌సినిమాపాటలు #animaltelugumoviesongs
Friday, December 15, 2023
Chandrababu speech from TDP Office వైసీపీ మునిగిపోయే నావ, పనోళ్ళను మార్చినట్టు mla లను మార్చారు
Chandrababu speech from TDP Office వైసీపీ మునిగిపోయే నావ, పనోళ్ళను మార్చినట్టు mla లను మార్చారు
Tuesday, December 12, 2023
Naxal To Minister| Seethakka inspiring Journey సీతక్క సక్సెస్ సీక్రెట్
Danasari Anasuya Alias Seethakka had a journey that feels like it is out of a Tollywood movie. Once a Maoist, Seethakka is now a minister in the CM Revanth Reddy cabinet. Mulugu MLA Seethakka stole the show at the swearing in ceremony held in lb stadium, hyderabad. Seethakka received a cheer as loud as CM Revanth Reddy, This video narrates her life journey/biography from being a Maoist to a minister.
ములుగు ఎమ్మెల్యే సీతక్క సక్సెస్ సీక్రెట్. నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకు ఎదిగిన ధనసరి అనసూయ జీవిత కథ ఈ వీడియోలో చూడండి. గవర్నమెంట్ హాస్టల్‌లో ఉంటూ.., చాలీ చాలని తిండి తింటూ..., పదో తరగతి గట్టెక్కడమే కష్టం అనుకునే ఓ ఆడపిల్ల.. పీహెచ్‌డీ పట్టా అందుకునే స్థాయికి ఎదిగితే.., చేత్తో తుపాకీ పట్టుకుని, పదేళ్ళపాటు విప్లవాన్ని నెత్తికెత్తుకున్న ఓ నక్సలైట్.. అన్నీ వదిలేసి, ప్రజల మధ్యకొచ్చి, వారి ఓట్ల మద్దతుతో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదగితే..,కరోనా టైమ్‌లో పక్కోడ్ని కూడా పట్టించుకోని సమాజంలో... జనం కోసం నెత్తిమీద నిత్యావసరాలు పెట్టుకుని కొండల్లో నడుచుకుంటూ వెళ్లి గిరిజనుల్ని ఆదుకోవడమంటే.., ఈ మూడు.... కథలు కాదు.. ఒకరి జీవితం. ఆ ఒకే ఒక్కరే ధనసరి అనసూయ... అలియాస్ సీతక్క.