Tuesday, December 19, 2023

యానిమల్‌ సినిమా రేంజ్‌ పెంచేసిన టాప్‌ 3 మ్యాజికల్‌ మ్యూజికల్‌ సీక్రెట్స్‌

యానిమల్‌ సినిమా ఈ వీకెండ్‌ పూర్తయ్యేటప్పటికి, అంటే పదహారు రోజులు గడిచేటప్పటికి ఏకంగా ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. వీటికి ఓటిటి రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌, మ్యూజిక్‌ రైట్స్‌... ఇలాంటివన్నీ ఎక్స్‌ట్రా. ఇక ఈ సినిమాలో నటించిన..., నటించిన ఏంటి?... వినిపించిన, కనిపించిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వచ్చింది. సెకండ్‌ హీరోయిన్‌ తృప్తి డిమ్రికి, విలన్‌గా చేసిన బాబీ డియోల్‌కు, ఆ విలన్‌ మొదటి భార్య, రెండో భార్య, మూడో భార్యగా చేసినోళ్లకు, చివరకు విలన్‌ ఎంట్రీ సాంగ్‌లో ఒక్క సెకన్‌ కనిపించిన తన్నాజ్‌ దావూదీ అనే అమ్మాయికి  కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇంత మంది రేంజ్‌ పెరిగిందంటే సినిమా సూపర్‌ హిట్‌ అనాల్సిందే కదా. సరే ఇంతకీ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడానికి కారణం ఏంటి? దట్‌ ఈజ్‌ మ్యాజిక్‌. సందీప్‌ రెడ్డి ఈ సినిమాలో ప్రతి పది, పదిహేను నిమిషాలకు ఓ చిన్న సర్‌ప్రైజ్‌ ఎలిమెంటూ, ఓ హై ఇచ్చే మూవ్‌ మెంట్ ఇస్తూ..., తను చెప్పాలనుకున్న కంటెంట్‌ను చాలా ఇంపాక్ట్‌తో చూపించాడు. సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్స్‌ సినిమా అంతా అలా కనిపిస్తూనే ఉంటాయి. అండర్‌వేర్‌ గురించి డిస్కషన్స్‌, న్యూడ్‌గా కనిపించే సీన్స్‌.. ఇలా వరుసగా వస్తూనే ఉంటాయి. అయితే సర్‌ప్రైజ్‌ అయినా ఉంటుంది, లేదా షాక్‌ అయినా తగులుద్ది. అంతే తప్ప కుర్చీలో కుదురుగా కుర్చొని చూసేలా ఉండదు. అందుకే సినిమా ఆడియన్స్‌కు నచ్చింది. ఇక మూడు మ్యూజిక్‌ బిట్స్‌ సినిమా రేంజ్‌ పెంచేశాయి. ఆ మ్యూజికల్‌ సీక్రెట్స్‌ ఈ వీడియోలో చూడండి. #యానిమల్‌సినిమా #యానిమల్‌సినిమాపాటలు #animaltelugumoviesongs

No comments:

Post a Comment